కార్పోరేట్ ప్రపంచంలోని అవినీతి మీద కోపంగా ఉందా? వాల్ స్ట్రీట్, పెద్దపెద్ద బ్యాంకుల మీద కోపంగా ఉందా? చేయాల్సిన సరైన పనులు చేయకుండా, చేయకూడని చెడ్డపనులు చేస్తున్న ప్రభుత్వం మీద కోపంగా ఉందా? లేక, మీ ఆర్ధిక పరిస్థితులను అదుపులో ఉంచుకోనందుకు, మీమీదే కోపం కలుగుతోందా?
జీవితం కఠీనంగానే ఉంటుంది. ప్రశ్న ఏమిటంటే - దాని గురించి మీరేం చేయదలుచుకున్నారు? ఆర్ధికవ్యవస్థ గురించి ఏడుస్తూ కూర్చున్నా, లేక ఇతరులను నిందించినంత మాత్రాన మీ ఆర్ధిక భవిష్యత్తుకు భద్రత కలగదు. మీరు సంపద కావాలనుకుంటే, దానిని మీరు సృష్టించాలి. మీ ఆర్ధిక భవిష్యత్తును మీ చేతుల్లోనే ఉంచుకునే ఆవశ్యకత ఉంది. దానికోసం మీరు మీ ఆదాయం మూలాన్ని అదుపులోకీ తీసుకోవాలి - ఈనాడే!
మీకో సొంత వ్యాపారం ఉండాలి.
అధిక సంఖ్యాకులకు ఆర్ధికపరంగా ఇది కష్టకాలం కావచ్చు. కాని ఎంతోమంది వ్యాపారవేత్తలకు సొంత వ్యాపారం ఏర్పరచుకోవటానికి ఇదే సరైన సమయం. దీనిని మించిన సమయం ఇంతవరకూ రానేలేదు.