ఇది సినీమా వ్యాసాల సంపుటి. ముందుగా సినీమాను తలదన్నే గొప్ప సినీమాలాంటి సంఘటన. దాదాపు 35-40 ఏళ్ల కిందట - ఓ చిరిగిపోయిన కాగితం మీద ఒక కవిత కనిపించింది. రచయిత పేరు వంశీకృష్ణ. కవిత నాకు చాలా నచ్చింది. ఎంత నచ్చిందంటే ఆ కవితని నా డైరీలో వ్రాసి ఉంచుకున్నాను. కవిత పేరు 'ఒక మాజీ ప్రేయసి'.