షెర్లక్ హోమ్స్ గురించి అతని మిత్రుడు డాII వాట్సన్ గురించి ఇవాళ కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. తనదయిన తీరులో టోపీ, పైప్‌లతో హూమ్స్ పేరు వినగానే అతని రూపం కళ్లముందు మెదులుతుంది. ఆలోచన, చాకచక్యం లాంటి లక్షణాల సాయంతో ఎంతటి చిక్కు సమస్యనయినా హోమ్స్ సులభంగా విడదీస్తాడు.
వంద సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా హోమ్స్ పేరు ప్రఖ్యాతలు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు. నిజంగానే హోమ్స్, వాట్సన్‌లు బేకర్స్ స్ట్రీట్‌లో బ్రతికారని అనుకునే వాళ్లు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అందుకే తరతరాలుగా హోమ్స్ నవలలు, కథలను ప్రపంచమంతటా ఇష్టంగా చదువుతున్నారు.
షెర్లక్ హోమ్స్ పాత్రను సృష్టించిన కానన్ డాయ్ల్ కన్నా అతని పాత్రలకు ఎక్కువ పేరు వచ్చిందంటే ఆశ్చర్యం లేదు.
ఇది హోమ్స్ పరిశోధనలలో మొదటి నవల. ఇందులోనే పాత్రల పరిచయం మొదటిసారిగా జరుగుతుంది.