'ఇంటర్నెట్' అంటే ఏమిటి? ఇంటర్నెట్ వలన కలుగు ప్రయోజనాలు గురించి డా.కె. కిరణ్ కుమార్ గారు మనకు చాలా క్లుప్తంగా ఈ పుస్తకంలో వివరించారు. ఇంటర్నెట్ వలన కలుగు ప్రయోజనాలు :
1. ప్రపంచంలో ఎక్కడికైనా క్షణాలలో ఇ- మెయిళ్ళని పంపగలరు. అందుకోగలరు.
2. మీరు ప్రపంచం యావత్తూ సందర్శించవచ్చు. మీ స్నేహితులతో, ఇతరులతో సంభాషించవచ్చు.
3. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడ లభ్యమౌతాయో తెలుస్తాయి. విదేశాలలో ఎక్కడ మంచి చదువు లభిస్తాయో సూచిస్తుంది.
4. ఈ మధ్యనే వచ్చిన విడియో కాన్ఫరెన్స్ పద్దతి ద్వారా విదేశాల్లో వున్న బంధు మిత్రులను సందర్శించుకోవచ్చు.
5. పోటి పరిక్షలకు వెళ్ళే విద్యార్ధులకు జనరల్ నాలెడ్జ్, లాజికల్ రీజనింగ్ ద్వారా శిక్షణ ఇస్తుంది. వారి వక్తిత్వికాసానికి పదును పెడుతుంది.
6. మీ కంప్యుటర్ లోకి ఇతర కంప్యూటర్ల నుండి ఫైళ్ళు దిగిమతి చేసుకోవచ్చు. మీకు కావాల్సిన రకరకాల సాఫ్ట్ వేర్లను, గేమ్ లను, వెబ్ పేజీలను మీ కంప్యూటర్ లోకి దిగుమతి చేసుకోవచ్చు.
7. వ్యాపారస్తులకు ఏ రకపు వ్యాపారం బాగుంటుందో, వాటి లోట్లు పాట్లు ఏమిటో తెలియజేస్తుంది. ఫలానా షేరు మార్కేట్ లో ఎంత ఉందో తెలియజేస్తుంది.వెబ్ సైట్స్ వలన కలుగు ప్రయోజనాలు,ఇంటర్నెట్ గురించి, వెబ్తె సైట్, గురించి తెలుగులో అందరికీ అర్ధమయ్యే విధంగా చాలా చక్కగా కె.కిరణ్ కుమార్ గారు వివరించారు.