PublisherVisalaandhra Publishing House ISBNVPH0481 AuthorPro.Tenneti.Jayaraju LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages246
Description
జీవన ప్రమాణం మానవభివృద్ది, ఆర్థికాభివృద్ధిలో ఇంకా 135 స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఒక అగ్రరాజ్యంగా అభివృద్ధి చేయాలనీ, ప్రపంచ దేశాలలో మొదటి 10లో స్థానం పొందాలని ఉరకలు వేస్తున్న దశలో యువతలో ఆహార పదార్ధల విషయంలో వైషమ్యాలను రెచ్చగొట్టి పెత్తందారీ ధోరణులను రగుల్కొలిపే రీతిలో మన సంస్కృతీ సంప్రాయాలను మళ్లించడం అత్యంత విచారకరం.
ఒక పదార్థం తినదగినదా? కాదా? ఎవరు నిర్ణయిస్తారు? పూజారులా? బాబాలా? రాజకీయ నాయకులా? అనే అంశం పై చక్కటి చర్చ ఇందులో ఉంది. ఏమి భుజించాలో ఎలాంటి దుస్తులు ధరించాలో ఏమి చదవాలో ఎవరిని ప్రేమించాలో అనే విషయాలు వ్యక్తిగతమైనవి. తమకిష్టమైన ఆహారం భుజించినందుకు తోటి మానవులను ద్వేషించి అవమానించి హింసించే అమానవీయ పోకడలను ఈ పుస్తకం తూర్పారబడుతుంది. దేశంలో ఉన్న గొప్ప పశుసంపదను శాస్త్రీయ కోణంలో వినియోగించుకోలేక పోవడం వెనుకబాటుతనానికి ఒక ముఖ్య కారణంగా ఈ పుస్తకం నిరూపించింది.
20 అధ్యాయాలతో అనేక పట్టికలు, చిత్రాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. కొత్త కోణంలో పరిశోధన సాగిస్తూ పాఠకులను ఆలోచింపచేసే అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. అనేక ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన విషయాలను విశ్లేషించింది. మొదటనుండి చివరివరకు ఆసక్తికరంగా పాఠకులను అలరింపజేస్తుంది.