ఒక్కోసారి అశ్రద్ధవల్లనో, అజ్ఞానంవల్లనో ఒక ప్రముఖ వ్యక్తిని మనం గుర్తుపట్టం. అప్పుడు పక్కనుండే మన మిత్రుడు, ఆ వ్యక్తిని మనకి పరిచయం చేస్తాడు. అవునా! అనుకుంటాం. దేవీప్రసాద్గారు ఈ పుస్తకం ద్వారా చేసిందిదే. మనం విస్మరించిన ఎన్నో ఆహారాలను-వాటి విశేషాలను మనకి తిరిగి పరిచయం చేసారు.