"ఆకాశం అవతలివైపుకి...." కవితా సంపుటిలో శ్రీ శర్మగారు అనేక అంశాలను కవితా వస్తువులుగా ఎంచుకున్నారు. తాను బోధించిన సబ్జక్టు తాత్వికత - ప్రక్రుతి పరిరక్షణ వంటి అంశాలతో పాటు సమకాలీన సమాజం అందులోని వ్యక్తులు సమస్యలు కేంద్రంగా అయన కవితలు వున్నాయి. తనదైన శైలితో మంచి కవిత్వంలో మన ముందుకొచ్చిన శర్మ గారికి అభినందనలు. అయన నిరంతర చైతన్యశీలి. భవిష్యత్తులో అయన నుండి మరిన్ని రచనలు ఆశిస్తున్నాను.