PublisherNavodaya Book House AuthorPotturi Vijaya Lakshmi ISBNNAVOBH0006 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages194
Description
అంతా విని నవ్వేశాడు రామారావు. "అందులో వింత ఏం ఉంది బావగారూ! అది లోక సహజం. పెళ్ళయ్యాక పెళ్ళాం కొంగు పట్టుకుని తిరగక మీ వేలు పట్టుకొని తిరుగుతాడా? అందరూ అంతే. ఆ మాటకొస్తే నా కొడుకు మాత్రం గొప్ప విష్ణుభక్తుడు కాడూ!" అన్నాడు.
మనోహర్ విష్ణు వంక చూసి చిలిపిగా నవ్వాడు. సిగ్గుపడుతూ లోపలికి పారిపోయింది విష్ణు.
(ఆనందమే అందం)
ఇది మామూలే. ఓటెయ్యడానికి వాహనంలో తీసికెళ్తారు గానీ ఓటేశాక వాహనంలో ఇంటిదగ్గర దింపరుగా! ఫర్వాలేదు నేను ఆటోలో వెళ్తాను అన్నాను. ఆటో పిలిపించింది. ఆటో ఎక్కాను. నవ్వు ఆగలేదు. ఆటోడ్రైవరు వెనక్కి తిరిగి చూశారు.
"పిచ్చిదాన్ని కాదు నాయనా! ఏదో గుర్తొచ్చి నవ్వుకొంటున్నాను నువ్వు పోనీ" అన్నా.