కిరణ్మయి కథలు చదువుతూంటే, ఆమె కథ రాయాలని రాయలేదనిపిస్తుంది. తన అనుభవాలు, అనుభూతులు బయటపెట్టక తప్పనంత అనివార్యత తనకు అనిపించినప్పుడు మాత్రమే ఈ రచనలు చేసినట్టు అనిపిస్తుంది. ఈ కథల్లోని మరో లక్షణం - వీటిలో ప్రస్తావించిన సమస్యలు, ఘర్షణలకు ఒక ముగింపు ఇవ్వాలన్న ఆలోచనే లేకపోవడం. ఇవి ఆలోచనల సారంలా ఉంటాయి. కథాచిత్రాల్లా ఉంటాయి.