అధ్యాపనం – అభ్యసనం – అధ్యయనం అనే ఈ మూడు పక్రియలు నూటికి నూరుపాళ్లు, మానవుడు విద్యావంతుడవడంలో ప్రభావాన్ని చూపిస్తాయి. ఇందులో ఏ ఒక్క దశను సంపూర్ణంగా అవలంబించని పకంలో, అతడు అసంపూర్ణ విద్యావంతుడుగానో లేక చదువు ఒంటబట్టలేదనే నెపంతోనో మిగిలిపోతాడు. ఉపాధ్యాయుడు ప్రేరకుడు, మార్గదర్శకుడు. పిల్లల ఎడ కరుణ, ప్రేమ, దయ కల్గి ఉండాలి. పిల్లలనర్థం చేసుకొనే మనస్తత్త్వం ఉండాలి. నిరంతర అభ్యాసకుడుగా ఉండాలి