ప్రాచీన గ్రీకుదేశంలో బానిసగా జీవించిన ఈసఫ్ అనే కథకుడు చెప్పిన మరపురాని కథల సమాహారమే ఈసఫ్ కథలు. ఆసక్తికరంగా సాగే ఈ జంతువుల కథలు పిల్లలకు సూక్ష్మంగా ఉండే నీతులను బోధిస్తూ వినోదాన్నీ మానసిక ఉల్లాసాన్నీ కలిగిస్తాయి. జీవితాన్నీ ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఈ చిట్టిపొట్టి కథలు చాలా ఉపయోగపడతాయి. ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా మాట్లాడే జంతువులనూ చెట్లనూ కథలలో పాత్రలను చేసి ప్రతి కథ చివరా ఒక నీతి వాక్యాన్ని చేర్చడం జరిగింది. ప్రపంచంలో అపూర్వమైన స్వీయబోధన గ్రంథాలలో ఉత్తమమైనవి ఈసఫ్ కథలు.