బైరాగిని కొంతకాలంపాటు ఒక లక్ష్యమంటూ లేకుండా గడిపేటట్టు చేసింది. ఆ సమయంలోనే బైరాగి యువ హృదయాన్ని క్విట్ ఇండియా ఉద్యమం ఆకర్షించింది. రహస్య సమావేశాలు ఏర్పాటు చేయడం, కరపత్రాలు రహస్యంగా పంచటం మొదలయిన కార్యక్రమాలలో బైరాగి పాలుపంచుకునేవాడు. నాయకులు జైళ్ళలో మగ్గటం, ఉద్యమం విఫలం కావటంతో నిరాశా నిస్పృహలకు లోనయిన బైరాగికి యాదృచ్ఛికంగా ఎం.ఎన్.రాయ్, నెలకొల్పిన రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ నాయకులతో పరిచయం దినదినాభివృద్ధి చెందినది. అది బైరాగి జీవితంలో అతి ముఖ్యమైన మలుపు.