మహాభారతంలోని అతిముఖ్యమైన పాత్ర ఆచార్యద్రోణుడు. వారి జీవితాన్ని కేంద్రబిందువుగా తీసుకొని వ్రాయబడినదీ పౌరాణికనవల. ద్రోణుడు, వారి సమకాలీన పాత్రల జీవితాల్లోని వివిధ కోణాలకు సంబంధించిన సమగ్ర మౌలిక ఘటనలే యీ నవలకు ఆధారాలు. మహాభారత సంగ్రామాన్ని వివిధ కోణాల్లో ఆకళింపు చేసుకోవడానికి యివి ఎంతో ఆసక్తిని కలుగజేస్తూ సహకరిస్తాయి. ప్రారంభంలోనే రచయిత మహాభారతాన్ని మహాసాగరంగా అభివర్ణిస్తూ అన్నారు-"దీనిలోని ప్రతికెరటం ఒక దివ్య రహస్యాన్ని అపార సౌందర్యాన్ని వెల్లడిస్తుంది”.