మన మీద మనకు గౌరవ మర్యాదలు ఉంటే భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ జీవితాన్ని, దాంతో పాటు లభించిన మన శక్తి సామర్థ్యాలు, ప్రకృతి సంపదలాంటి అన్నిటిని మన భాగస్వాములుగా చేర్చుకొని ఆకాశాన్నందుకునే ప్రయాణం మొదలు పెట్టవచ్చు. ఇక్కడి నుండి మొదలయిన ప్రతి కథ సుఖాంతమే అవుతుంది. అసాధ్యమంటూ ఏమీ ఉండదు. అశాంతి అసలే ఉండదు. ఆకాశం నిర్మలంగా, ప్రశాంతంగా మనకు అందుబాటులో ఉంటుంది.