PublisherHyaderabad Book Trust ISBNHBT0005 AuthorPaula Richman LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages162
Description
రాముని ఉంగరం యాదృచ్చికంగా నేల మీద పడి ఒక రంధ్రం చేసుకుంటూ పాతాళ లోకంలోకి జారిపోతుంది. దాన్ని తేవడం కోసం హనుమంతుడు పాతాళ లోకానికి వెలతాడు. పాతాళ రాజు వేలాది ఉంగరాలు వున్న ఒక పళ్ళెం తెచ్చి హనుమంతుని ముందు పెట్టి "ఇందులో నీ రాముని ఉంగరం తీసుకో" అంటాడు. ఒకే విధంగా ఉన్న ఆ ఉంగరాలలో ఏది తన రాముడిదో గుర్తించలేక అయోమయంలో పడతాడు హనుమంతుడు. అప్పుడు పాతాళ రాజు "ఈ పళ్ళెంలో ఎన్ని ఉంగరాలున్నాయో అంతమంది రాముళ్ళు వున్నారు. నీ రాముని అవతారం ముగిసింది. రామావతారం ముగిసినప్పుడల్లా ఆయన ఉంగరం ఇలాగే పడిపోతుంది. అవ్వన్నీ పోగుచేసి పెడతాను" అంటాడు.
భారతదేశ చరిత్రలో అనేక రామ కథలున్నాయి. చాలా మంది పండితులు వాల్మీకి రామాయణమే ప్రామాణికమైనదిగా భావిస్తున్న తరుణంలో, ఈ సంకలనంలో వ్యాస రచయితలు ఆ అభిప్రాయంతో విభేదిస్తారు. ప్రజల మధ్య ఉన్న అనేక రామాయణాలను గురించి ప్రస్తావించి వాటిని విశ్లేషిస్తారు. స్థల కాలాలు, రాజకీయ నేపధ్యం, ప్రాంతీయ సాహిత్య సంప్రదాయాలు, మతాచారాలు, పాఠకుల, శ్రోతల అభిరుచులు, సృజన శీలత మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకుని చరిత్రనిండా ఎన్ని రామాయణాలు రూపుదిద్దుకున్నాయో సోదాహరణంగా వివరించే అరుదైన, కొత్త ఆలోచనలు రేకెత్తించే సంకలనం ఇది.