కొందరి జీవితాలు సాఫీగా నల్లేరుపై నడకలా సాగుతాయి. కొందరివి ఎత్తుపల్లాల దారిలో, రాళ్ళు రప్పల మధ్య కష్టాలతో సాగుతాయి. కష్టాలు నేర్పిన పాఠాలు సుఖాలు నేర్పలేవు. ఒక్కమాటలో చెప్పాలంటే, మానవ జీవితం పరమార్థ అన్వేషణతోనే సార్థకత పొందుతుంది. కష్టాలు మానవ జీవితంలో పెనుమార్పులను తీసుకువస్తాయి. కొందరు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొంటే, కొందరు నిర్లిప్త జీవితం గడిపితే, ఇంకొందరు వాటిని తట్టుకొని నిలబడి, తమ జీవితాలు ఆదర్శవంతంగా భావితరాలవారికి మార్గదర్శకంగా ఉండేలా మార్చుకుంటారు.
మీరు మరణించాలంటే చదవండి; జీవించాలంటే తప్పక చదవండి.