అయోధ్య వివాదం ఫైజాబాద్ వీథుల్లో, న్యాయస్థానాల వేదికల్లో తేల్చాల్సిన అంశం కాదు. ఇది మత వివాదం కూడా కాదు. ఇది రాజకీయం. అధికారంకోసం సాగే వ్యూహాలు ప్రతివ్యూహల్లో హిందువులు-ముస్లింలు, వారి మతాభిమానాలు, అభిమాన మనోభావాలు, దురభిమానాలు పావులుగా మారిపోతున్నాయి. పూజలు అందుకొనే భగవాన్ బాలరాముడు, ప్రార్థనలందు కోవలసిన అల్లా మినహా యింపులు కాదు. ఈ వ్యూహాల్లోంచి బయటపడితే తప్ప సయోధ్య సాధ్యం కాదు.