నేటి బాలల్లో రేపటి మహానటులూ వుంటారు. వారిలో వున్న నటనా కౌశలాన్ని వెలికి తీయటానికి లబ్దప్రతిష్టులైన నాటక రచయితలతో ప్రత్యేకంగా రాయించిన బుల్లి బుల్లి నాటికల సంకలనమే ఈ 'బడి గంటలు'.ఈ సంకలనంలో మీకు నచ్చిన ఏదో ఒక నాటికను ఎంపిక చేసుకొని, చిన్నారి నటులతో వేషాలు కట్టించి పాఠశాల వార్షికోత్సవాల్లో, పండుగల సందర్భంగా ప్రదర్శించుకోవటానికి అనువైన హాస్య, సందేశాత్మక నాటికలివి.