PublisherMannava Publications ISBNVPHTO0075 AuthorStephen David Kuraganti LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages128
Description
క్రి.శ. 1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని జయించి ఢిల్లీ సుల్తాన్ లు ప్రతాపరుద్రుని యుగంధరుని కోశాధికారుల హరిహర రాయలు బుక్కరాయలు ఇంకా అనేకమంది సైన్యాధికారులను వారి కుటుంబాలతో సహా ఢిల్లీకి తరలిస్తారు. కానీ దారిలోనే ప్రతాపరుద్రుడు నర్మద నదిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటాడు. మిగతా వారిని ఢిల్లీకి తరలించి అక్కడ అందరిని ముస్లిం మతంలోకి మార్చడం జరిగింది.
యుగంధర్ ని ముస్లిం మతంలోకి మర్చి మాలిక్ మక్బుల్ అని పేరు మార్చారు. తరువాత ముల్తాన్ ప్రాంత గవర్నర్ గాను ఢిల్లీ ఉపప్రధానిగాను నియమిస్తారు. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో అత్యున్నత ప్రధాని పదవిని అలంకరించి ఢిల్లీ సులనెట్ లో కీలక భూమిక పోషించడం జరిగింది. యుగంధర్ అక్కడ కాకతీయుల కాలం నటి దసబంధ విధానాన్ని నాయంకర వ్యవస్థను ఉద్యానవనాల అభివృద్ధిని చేపట్టి పరిపాలనలో నూతన ఒరవడిని సృష్టించి ఫిరోజ్ షా మన్ననలు పొందడం జరిగింది.
షుమారు 45 ఏళ్ళు ఢిల్లీ సుల్తాన్ ల దగ్గర వివిధ హోదాలను అనుభవించి ఎన్నో చారిత్రక కట్టడాలకు మార్గదర్శకులయ్యారు. ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి పారసీక అరబిక్ మూల గ్రంధాల ఆంగ్ల అనువాదం ఆధారంగా రాసిన ఈ గ్రంధం యుగంధరపై తోలి ప్రామాణిక గ్రంధం.