PublisherAnalpa Book Company AuthorKompella Radhakrishnamurthy ISBNABC0008 LanguageTelugu BindingPaperback Publication Date2018 No. of Pages162
Description
భారతీయ కథా సాహిత్యానికి మూలమైన 'బృహత్కథ' నుంచి వెలుగుధారగా ప్రవహించిన 'కథాసరిత్సాగరమ్' తరగని కథల గని. గడచిన వెయ్యేళ్లకు పైగా కాలంలో ఎన్నో ఎనెన్నో కథల రాశులను సంస్కృత మహాకవులు ఆ గని నుంచి వెలికితీసి భారతావనికి అందించారు. సంస్కృత కథాసాహిత్యం ఆధారంగా తెలుగులో తొలుత కథాకావ్యాలు, ఆ తర్వాత కథాసంపుటాలను మన కవులు సృజించారు. కేతన, మంచన, జక్కన వ్రాసిన కథాకావ్యాల పరంపరలో వచ్చిన అనంతుని 'భోజరాజీయం' , కొరవి గోపరాజు 'సింహాసన ద్వాత్రింశిక' - ఆబాలగోపాలాన్ని మురిపించిన కథాగుచ్ఛలు. సంస్కృత, ప్రకృతాంధ్రాలలో చక్కని పండితుడైన గోపరాజు రచనకు సంస్కృత, తెలుగు పండితులు శ్రీ కొంపెల్ల రామకృష్ణమూర్తి నేటి తెలుగులో ఇచ్చిన రూపమే ఈ భోజ - సాలభంజికల కథలు.