అప్సరసలను కూడా ధిక్కరించే సౌందర్యవతి బృంద…. గానంలో, నాట్యంలో అద్వితీయ ప్రతిభకల కన్య…. కాని ఆమెను ప్రాణాధికంగా ప్రేమించిన మురళి ఆమెను పొందలేకపోయాడు. ఆమె బురదలోని తామర పువ్వు… అతడో, ఉన్నత వంశపు కిరీటాన్ని ధరించి, పేరు ప్రతిష్ఠల సింహాసనాన్ని అధిష్టించవలసిన సంపన్న యువకుడు. తల్లీ, తండ్రీ, చెల్లెలూ, అందరూ ఒకటేమాట. అతడు చెల్లెలి వలెనే జముననూ చెల్లెలుగానే ప్రేమించాడు, కాని విధి వక్రించి జమునను వివాహం చేసుకోవలసి వచ్చింది. అటు బృంద మురళిని కోల్పోయి, ఏ ఆశాలేక దుర్మార్గుడైన నాగేంద్రను తన శరీరంతో వ్యాపారం చేయదలచుకున్న నాగేంద్రను వివాహమాడక తప్పలేదు. నరకాన్ని అనుభవించింది… సహించింది… చివరకు దేవతవలె పవిత్రంగా తనువు చాలించింది. తామర పువ్వు పుట్టుక పంకంలోనే కావచ్చు. కాని అది దైవపూజకు పనికిరాదా? పుట్టుకతోనే అపవిత్రురాలని ముద్ర వేసి మానాభిమానాలు లేని మాంసపు ముద్దగా వెలకట్టే అధికారం ఎవరికి, ఎవరిచ్చారు? హృదయాలను కరిగించే కథాసంవిధానంతో, సజీవమైన పాత్రపోషణతో సాగిన ఉత్తమ నవల…