అసమ చరిత్రుడు జ్ఞానపురుషుడా చారువు
దార్శనికుడపురూపుడౌ భోగపురుషుడు
దానశూరుడు సాహసి చతుర క్షమాశూరుడు
రాగభోగములనీది వీతరాగముదెస
సాగిన ఘను డుదారి ధరకు మేరు సత్త్వము
సంస్కృత ప్రాకృత కన్నడాంధ్ర కవుల పాలికి సురభి
కావ్యములు చెక్కినవి దేదీప్య బింబమును
విస్తరించె చారు చరిత కనులకెదకు విందుగా
పెద్దలకు మ్రొక్కి ఎదనిండుగ కవుల తలచి
పాత కథ నీ నవకాలపు నచ్చుబోసి
పునర్జన్మ గన్నకథను మురిసి విస్తరించితి.
రసవత్కావ్యాల చూచి చవిగొనిన మహాత్ములిపుడు
బంధుర మీకావ్యము సుందర సురమ్యమని
మెచ్చునదె సంమానము నాకు పెద్ద బిరుదము.