పిల్లలే పాత్రలుగా గల అచ్చమైన పిల్లల సాంఘిక కథలు. పిల్లలకు పాఠాలు చెప్పి, ఆటలు ఆడించి, పాటలు పాడించి వారిని తీర్చిదిద్దిన ఓ బడి పంతులు పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందటానికి అల్లిన అద్భుతమైన కథలు చింతకాయల బేరం. ప్రకాశం జిల్లాలోని 'వైదన' గ్రామంలో జన్మించి ప్రభుత్వ ప్రాథమికోపాద్యాయులుగా పనిచేశారు. తన ఉపాధ్యాయ కృషికి గుర్తింపుగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానింపబడ్డారు. గేయ రచనలోగాని, పద్యరచనలో గాని వీరి శైలి సరళంగా ఉండి బాలలను ఇట్టే ఆకర్షిస్తుంది.