ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు భగవాన్ శ్రీధన్వంతరి ప్రసాదించిన వేద వైద్యము అయిన ఆయుర్వేదములో తెలియచేసిన సులభమైన చికిత్సలను ''చిటుకు చికిత్సలు'' అనే ఈ పుస్తకము రూపములో అందించాడు. గృహవైద్యము, ఇంటి వైద్యము, మొదలగు పుస్తకాలు ఎన్నో ప్రచారములో ఉన్నప్పటికీ ఈ పుస్తకములో ప్రత్యేకముగా ఒక వ్యాధిలో ఎంతవరకు మనకు మనమే చికిత్సలను చేసుకోవచ్చునో తెలియ చేసే ''హద్దును'' నిర్ణయించి తెలియచేయడం జరిగింది. దీని వలన స్వంత వైద్యముతో
వచ్చే అనవసర ప్రమాదాలను నివారించే ప్రయత్నమూ చేయబడినది. అదీకాక ఈ విధమైన ప్రకృతి ప్రసాదించిన మందులను వాడడము వలన, సైడ్ ఎఫెక్ట్స్ లేక పోవటమే కాక, మన రోగనిరోధక శక్తి మరింత పెంపొంది, కొత్త చీకాకులు కలిగే అవకాశము నశించిపోతుంది. దానితోపాటు ఆహారంలో పథ్యపానాల వివరాలను గూడ శాస్త్రీయంగా ఈ చిరుపొత్తంలో పొందు పరచటం జరిగింది.