మీలోని భయం, ఆందోళన, భయంకర అభద్రతా భావాలకు ప్రతిరూపమే దేవుడు. వాటివల్లే ప్రార్థనపుడుతుంది. మతాచార్యుడు వస్తాడు. వ్యవస్థికృత మతం తయారవుతుంది. చర్చిలు, దేవాలయాలు, మసీదులు వెలుస్తాయి. కాబట్టి, అంతిమ అసత్యం దేవుడే. అందుకే వాడి చుట్టూ అనేక అసత్యాలు అల్లుకున్నాయి. ఎందుకంటే, అసత్యం ఒంటరిగా జీవించలేదు. దాని మనుగడకు అనేక అసత్యాల తోడు కావాలి. అందుకే దైవాధార మతాలన్నీ అంతిమ అసత్యమైన దేవునికి ఆలంబనగా అనేక అసత్యాలను సృష్టించాయి. దేవుడు ఒక కట్టుకధ. కాబట్టి, దేవునిపై ఆధారపడినదేదైనా అసత్యమే. దేవునితో పెట్టుకుంటే మనిషి బానిస అయినట్లే. మహా అహంకారపరులైన ఎందుకూ పనికిరాని రక్షకులను, ప్రవక్తలను, మహాపురుషులను గుడ్డిగా నమ్ముతూ పవిత్ర గ్రంథాల ముందు, రాతి శిల్పాల ముందు, మట్టి విగ్రహాల ముందు బానిసలా మోకరిల్లి దేవుని ప్రార్ధిస్తూ బిచ్చగాడిలా అడుక్కోవలసిందే. మొత్తం మానవాళి ఒక గొప్ప ఆధ్యాత్మిక బానిసత్వం దిశగా పురిగొల్పబడింది.