విశేషమేమిటంటే తొమ్మిది రాత్రులు దుర్గనే ఉపాసన చేస్తారు. దుర్గని ఉపాసన చేసేటప్పుడు మొదటి మూడు రోజులు కాళీ స్వరూపంగా, మధ్యలోని మూడు రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా, చివరి మూడు రోజులు సరస్వతీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. అలా చేయడంలోని ఆంతర్యం మనుష్యుడు సహజంగా అనేకమైన వాసనలతో ఈ లోకంలోకి వస్తాడు. ఆ వాసనలను తొలగించగల శక్తి పేరు దుర్గ. సంప్రదాయజ్ఞులైన పెద్దలు ‘దుర్గ’ నామస్మరణ లేని రోజు ఉండకుండా చూసుకోవాలంటారు.