జాము పొద్దెక్కినా చిన్నరాణి మాధవీదేవి నిద్ర నుంచి మేల్కొనలేదు. పరిచారికలకు ఏమి పాలుపోలేదు. ఆమెకు నిద్రాభంగం చేసే సాహసం ఎవ్వరికీ లేదు. రాణికి ఎంతో సన్నిహితంగా వుండే ప్రియచెలి సరస్వతే ఎంతో ఆందోళనకు గురైంది. తీరా నిద్ర లేచాక ఇంత పొద్దెక్కేదాకా తనను గాఢ నిద్రలో ఉంచినందుకు చిన్నరాణి ఏమంటుందో? మేల్కొల్పితే ఏం చికాకుపడి కోపం చేస్తుందో? సేవికలందరూ ఎటూ తోచక కొట్టుమిట్టాడుతున్నారు.