ఈ రచయిత పేరు వినగానే "సెలవైయ్యింది " "కంచాలకథ " "పాదరేణువు " వంటి గొప్ప కథలు గుర్తుకొస్తాయి . ఇందులో 20 మంచి కథలున్నాయి .
ఈ కథలని లోచూపుతో చదువుతుంటే -ప్రకృతినీ, సమాజాన్నీ, మనుషుల్నీ అతి నిశితంగా పరిశీలించడం, అధ్యయనం చేయటం రచయిత స్వాభావిక లక్షణంగా కనిపిస్తోంది . కథకు వారు స్వీకరించే నేపధ్యాన్నీ, కల్పించే వాతావరణాన్ని గమనించుకుంటూ ఒక అవ్యక్త భావనా లోకంలోకి ప్రవేశిస్తాము . చిత్రమైన విషయం -ఆ నేపధ్యం చాలా వరకూ మనకు తెలిసినదే అవుతుంది. ఆ వాతావరణ స్పర్శ కూడా ప్రత్యక్షంగానో ,పరోక్షంగానో అనుభవించినదే అయివుంటుంది . ఈ గుణవిశేషాన్నే కథశాస్త్రం "కాల్పనికవాస్తవికత" అంటుంది .రాసె కథని వస్తుశిల్ప సమన్వితం చేయగల దిట్ట .!కథానికని నాలుగు కాలాలపాటు నిలబెట్టగల అనుభూతిని ఎలా అక్షరీకరించాలో తెలిసిన 'రసవాది'
అందుకనే శర్మగారి కథలు పాఠకులకే కాదు రచయితలకూ'పెద్దబాలశిక్షలు. '