గోదావరి నిర్మలంగాను ఉండగలదు పరవళ్లు తొక్కుతూ ఉరకగలదు పోటెత్తి బీభత్సాన్ని సృష్టించగలదు. కామేశ్వరి కథలు అలాగే కొన్ని ఆహ్లాదంగా కొన్ని ఆలోచనాత్మకంగా కొన్ని అగ్రహావేశాలని కలిగిస్తూ సాగిపోతాయి.
సరదాగా ఆహ్లాదంగా నడిచే కథల్లో కూడా ఒక సందేశం కనిపిస్తుంది. పెంపుడు జంతువులూ పెంచుకునేవారికి సంతోషాన్ని కలుగజేస్తాయి కానీ ఇంటికొచ్చినవాళ్ళకి ఎంత చిరాగ్గా ఉంటుందో ఒక కథ చెప్తుంది. ఇల్లాలి మాట కాదనలేక ఇంట్లో ఉన్న కుక్క పిల్లులతో మారుతీరావు అవస్థ కళ్ళముందు కనిపిస్తుంది ఇంకొక కథలో... ఋణానుబంధం జంతువులకి మానవులకి కూడా ఉంటుందని చెప్తరి కథల్లో.