'హింస' అనే ఇతివృత్తానికి, కృష్ణమూర్తి దాన్ని సమీక్షించిన తీరుకు 1970 సంవత్సరంలో అనేక మంది శ్రోతలను ఉద్ధేశించి అయన మాట్లాడిన సమయంలో ఎంత అవసరం వుండిందో నేటికీ అంతే అవసరం వుంది. హింసయొక్క స్వభావాన్ని చర్చించడంలో హింసతో సన్నిహిత సంబంధంవున్న గాయపడటం, పోటీపడటం, అభద్రత, భయంవంటి మానసిక అంశాల చిక్కుముడులను కూడా కృష్ణమూర్తి విడదీశారు. హింస అనే వాస్తవాన్ని ఖండించకుండా, అణిచివేయకుండా లేదా విశ్లేషించకుండా, దాన్ని నేరుగా చూసే విధానాన్నీ, ఆ విధంగా దానికి అతీతంగా వెళ్లడాన్నీ ఆయన చూపించారు. మనిషి మానసిక తత్త్వంలో నిజమైన ధార్మికతను సూచించే మౌళికమైన మార్పుకోసం ఆయన పిలుపు నిచ్చారు.