వ్యక్తిగత, రాజకీయ, పర్యావరణ చరిత్రను పడుగు పేకలుగా అల్లుతూ రాజకీయవేత్తా, విద్వాంసుడూ అయిన జైరాం రమేష్ ప్రకృతి వాది అయిన ఇందిరాగాంధీ కథను ఆమూలాగ్రం చదవకుండా విడిచిపెట్టలేనట్లుగా కథనం చేస్తున్నాడు. తన వ్యక్తిగతమైన అభిరుచిని ఆమె ఒక ప్రజాప్రయోజనకారి అయిన అంశంగా ఎలా మలచిందో, ఆమె రాజకీయ, ఆర్ధిక అభిప్రాయాలు మారినప్పటికీ పర్యావరణంపై ఆమె అభిప్రాయాలు ఎలా స్థిరంగా ఉన్నాయో, పర్యావరణ పరిరక్షకులతో ఆమె స్నేహాలు భారత జీవైవిధ్యాన్ని పరిరక్షించే ముఖ్యమైన నిర్ణయాలకు ఎలా దారితీసాయో, అడవులు, వన్యప్రాణులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె తన సహచరులను ఎంతగా ప్రాధేయపడిందో, ఒత్తిడి చేసిందో, ఒప్పించిందో, సూక్ష్మంగా అభివృద్ధి చెందిన ఆమె స్వీయ సహజ లక్షణాలూ, విశ్వాసాలూ మైలురాళ్లనదగిన విధానాలూ, కార్యక్రమాలూ, ప్రయత్నాలూ, చట్టాలూ, సంస్థల రూపకల్పనకు ఎలా కారణమయ్యాయో, అవి ఏ విధంగా ఈ నాటికీ నిలిచి ఉన్నాయో ఆయన ఈ గ్రంథంలో వివరించాడు.