జైమిని వ్యాసశిష్యుడైన మహాతపస్వి, మహామేధావి, మహాపండితుడు. ఎంతటిమహాత్ముడంటే, తన గురువైన వేదవ్యాసులవారే ఈయన్ని విష్ణు పురాణంలో - ‘‘సామగో జైమినిః కవిః’’ అని మెచ్చుకున్నారు. అంటే సామవేదాధ్యయనం చేసిన మా జైమిని మంచి కవి అని గురువుగారే ఈయనకు మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. ఈయన కేవలం సామవేదంఒక్కటే చదువుకున్నాడని అనుకోకూడదు. ఆయన చతుర్వేదాలు, శిక్షాదిశాస్త్రాలు,సమస్తవిద్యలు ఆపోశనం పట్టిన మహామేధావి.