పానుగంటి మానస పుత్రుడు జంఘాల శాస్త్రి ఆధునిక భావాలు సంతరించుకొని జంగాలునిగా మీ ముందుకు వచ్చాడు. ఆయన అభిప్రాయాలు మచ్చుకు కొన్ని.
''మంచి, చెడుల మధ్య యుద్ధంలో తటస్థంగా వుంటే చెడును సమర్థించినట్లే!''
''మానవులను ప్రేమించలేనివాడు ప్రపంచాన్ని, ందులో తన ఉనికిని కూడా ద్వేషిస్తాడు.''
''ఈ సమాజం అతికొద్దిమంది లాభాలకోసం వరుఎసతరాల పసిమొగ్గలను నలిపి నాశనం చేస్తున్నది.''
''డబ్బుని నువ్వు సంపాదించి ఖర్చుచేయాలిగాని నీ జీవితాన్నది ఖర్చు చేయకూడదు.''
''ఈ వ్యాపార వ్యవస్థ అన్నిటిని ధ్వంసంచేసి డబ్బునే ఏకైక మానవ విలువగా ప్రతిష్టించింది.''
''అవసరమైనవి మాత్రమే కొనేవాడు చేతకానివాడు. హోదాను తెలపడానికి కొనేవాడు గొప్పవాడు.''
''ఏ ఇతిహాసం, చరిత్ర చూసినా ప్రేమ, దయ, శాంతి, సహనం లాంటివన్నీ బూటకపు నీతులే!''
''చెడుజోలికి వెళ్ళకుండా అన్నీ మూసుకుని కూర్చున్న వాళ్ళను కూడా చేడు వదలదు.''
''తోటి బాధితులను ప్రేమించడం ఎంత అవసరమో దోపిడీని, దుర్మార్గాన్ని ద్వేషించడం అంతే అవసరం.''
''నీ జేబులో డబ్బు ఉండాలి గానీ, నీ మనసంతా డబ్బుతో నిండిపోకూడదు.''
''పీడకులు, పీడితులు ఉన్నపుడు సర్వమానవ ప్రేమను బోధించేవాడు పీడకుడే.''
''దేవుడు అవునోకాదో తెలియదుగానీ వ్యాపార సంస్కృతి మాత్రం సర్వాంతర్యామి అయిపోయింది.
''నేటి పిల్లవానికి ఆదర్శం తండ్రి కాదు, అంబానీ, అమితాబ్, సచిన్.''