పరాశర మహర్షి యొక్క హోరా శాస్త్రమునకు (జ్యోతిశ్శాస్త్రము) సంగ్రహమే ఈ జాతక చంద్రిక.
జాతక చంద్రిక ప్రామాణికమై పరాశర పద్దతిని వివరిస్తూ, జ్యోతిష్య విద్యార్దులనుండి జ్యోతిష్య ప్రకాండుల వరకు నిరంతరం అనుసరణీయమై ఉన్నది. దానికి మూలనుసారియైన వివరణ అందించడంలో శ్రీ వేగేశన రాధాకృష్ణ రాజు గారు కృతకృత్యులైనారు.
ఈ గ్రంధపఠనం జ్యోతిష్య విద్యార్ధులకు తప్పనిసరి అని భావిస్తున్నాను.