ఆకసమునందు విహరించు గ్రహముల, నక్షత్రముల, సంచార విషయములను సమూలాగ్రముగా తెలియజేయునది సిద్ధాంతము. గ్రహములు, నక్షత్రముల యొక్క కిరణ ప్రభావము వలన భూమిపైనున్న ప్రాణులకు కలుగబోయే శుభాశుభములను తెలియజేయు భాగమే జాతక భాగము. ఈ భూమిపై పాలకుల గూర్చి, ముందు కలుగబోవు ఉపద్రవములను, వర్షాభావములను గూర్చి, వాతావరణమును గూర్చి, సస్యావృద్ధి క్షయములను గూర్చి, భూకంపనములను మొదలగు వాటిని గూర్చి తెలియజేయు శాస్త్రము సంహితజ్యోతిషమనబడును. ఈ మూడు భాగములు కలిసి పూర్ణజ్యోతిషశాస్త్రముగా తెలియవలయును.