ఈ జ్యోతిష్య మౌళిక సూత్ర ఫల గ్రంధం Fundamental Priniciples of Astrology అనబడే మూలగ్రంధం శ్రీ కే.ఎస్ కృష్ణమూర్తి గారు ఆంగ్లములో రచించిన అధ్బుతమైన జ్యోతిష్య గ్రంధం. నేను ఈ గ్రంధం తెలుగులో అనువదించుటలో సహాయ సంకలన కర్తగా కే.పి పద్దతిలో నాకున్న అనుభవము దృవపరచితిని. ఈ గ్రంధం ద్వారా ఈనాటి కాలమునకు అనువుగా జ్యోతిష్యము దాని ఉపయోగము మరియు వాటి పరిధులను సూచిస్తూ పన్నెండురాశుల గుణగణాలు మరియు అవి ఏయే సంకేతములు తెలియజేయునో అదేవిధముగా వాటి ప్రాధాన్యత అనగా లగ్నం నుండి పన్నెండు భావముల వరకు ఒక్కొక్క భావంనకు గల ప్రాముఖ్యత మరియు ఆదిత్యాది గ్రహముల యొక్క గుణగణాలు ప్రత్యేకముగా చాయగ్రహములు, ఇంద్రుడు, వరుణుడు, ఫార్చునా యొక్క విశిష్టతలను గురించి వివరించడమనేది జరిగినది.