ఈ జీవితంలోకి ఎందుకొచ్చామో, ఎప్పుడోచ్చామో, ఎక్కడెక్కడ తిరిగామో, ఏమిచేశామో, ఏమి చెప్పామో, ఏమి విన్నామో, ఏమి తెలిసిందో అని సింహావలోకనంగా ఒక్కసారి వెనక్కి చూసుకుని, అంతే ఇక ముందుకెళ్ళిపోయాడు. ఆ ప్రయాణమూ, ఆ మలుపులే దువ్వూరి వెంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర. ఈ తెలుగు కరువు కాలంలో ఈ తెలుగు బీడుమీద కురిసిన జడివానే ఈ స్వీయచరిత్ర..