ఈనాటి కథకుల్లో పురుషులెవరో, పుణ్య పురుషులెవరో విచక్షణగా తెలుసుకునే వారు బహు కొద్దిమంది ఉంటున్నారు. ఇవాళ గొప్ప కథలు రాసేవాళ్ళను లెక్కించటానికి ఒక చేతి వేళ్ళే ఎక్కువ. వారిలో ఒకడైన కాళీపట్నం రామారావుగారి రచనలు ఇదివరకు పుస్తక రూపంలో రాకపోవటం ఎంత వింత! మంచి కథలు రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు. – కొడవటిగంటి కుటుంబరావు.
కథలంటే ప్రాణమిచ్చి, ఆ కథలకు పదిలమైన ఒక నిలయాన్ని ఏర్పాటు చేసిన మంచి కథకుడు అంతకు మించి మంచి ప్రేమికుడు అయిన కారా మాస్టారు సమగ్రరచనల సంకలనం ఇది.