భారతదేశపు మహాకావ్యంగా ‘మహాభారతం’ ఈనాటికీ నిలిచే ఉంది. ‘జయ’ అనే పేరుతో రచించబడిన ఈ కావ్యం పాండవుల గాథ. కురుక్షేత్రంలో విజయం సాధించినవారి తరపున చెప్పిన కథ అది. ‘అజేయుడు’ కౌరవుల గాథ. చివరి కౌరవుడిదాకా ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ మట్టుపెట్టిన కథ ఇది. జాతీయ స్థాయిలో అత్యుత్తమ గ్రంథంగా ప్రశంసలందుకున్న’అసురుడు’ రచయిత కలం నుండి వెలువడిన మరో పుస్తకం ఆసాంతం చదువరులని ఆకట్టుకుంటుంది. కలియుగారంభం అంధకారభరితంగా ప్రారంభమైంది. ప్రతి స్త్రీ, పురుషుడూ కూడా కర్తవ్యం – మనస్సాక్షి, గౌరవం – అవమానం, జీవితం – మరణం వీటిలో ఒకదాన్ని ఎంచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.