హిందీ సాహిత్యంలో సుప్రసిద్ధ నవలా రచయిత అమృత్ లాల్ నాగర్ కు ఒక విశిష్టమైన స్థానమున్నది. మౌలికమైన ప్రతిభాసంపన్నుడిగా నాగర్ తమ నవలల్లో అనుభూతి ప్రధానమైన వాతావరణాన్ని అల్లుతారు. పాత్రల మానసిక అగాదాల్లోకి చొచ్చుకుపోతారు. వ్యంగ్య ప్రధానమైన శైలిలో దేశకాల పరిస్థితులకు అద్దం పడతారు. అలాగే వస్తుపరంగా ఇతివృత్తాన్ని అనుసరించి తమ శైలీ సంవిధానాన్ని రూపొందించుకుంటారు. నాగర్ సమకాలీన సమస్యలను, సామాజికపరమైన ఇతివృత్తాలను తీసుకొని సజీవమైన హిందీ నవలలు రచించారు.