సమాజంలో ఎన్నో విభిన్నమైన పాత్రలను రచయిత అద్భుతంగా ప్రవేశపెట్టాడు. పెట్టుబడిదారీ అనంతర సమాజంలో అవసరమైన ఉన్నత మానవ విలువలకు పెట్టుబడిదారీ సమాజంలోనే పునాదులేర్పడతాయని ఈ నవలలోని కొన్ని పాత్రల ద్వారా రచయిత మనకు చూపిస్తాడు. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలపై ఆధారపడి ఉంటాయన్న సత్యాన్ని తెలియజేశాడు. కిషన్ చందర్ రచనలు సమాజ స్వరూపానికి అడ్డం పడతాయి. మహోదాత్త శ్రమకి, ప్రేమకీ నీరాజనమిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలీ, జీవిత వైవిధ్యం, మానసిక అంతర్మథనానికీ మాటలతో రూపమివ్వటం ఆయన ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి.