మనం బహిరంగంగా చర్చించుకోలేని అనేక అంశాల గురించి మనకన్నా ఎంతో సాహసించి ఎన్నో గ్రంథాలను నిర్భయంగా రాసిన మహర్షులు వాటికొక శాస్త్ర ప్రతిపత్తి కల్గించగలిగారు. నేటి.. మేటి. శాస్త్రవేత్తల కన్నా ఈ మహనీయులు ఎంతో ముందు చూపు కలవాళ్ళనడం అతిశయోక్తి కాదు. అసలు అతిశయోక్తుల అవసరం ఇక్కడ ఏమాత్రం లేదు. సంభోగానికి పరమ ప్రయోజనం సత్సంతానమేనని నమ్మిన జాతి మనది. జంటకట్టే దంపతులు మానసిక స్థితి పుట్టబోయే బిడ్డ జీవన విధానాన్ని నిర్ధేశిస్తుందని సశాస్త్రీయంగా నిరూపించారు. మహర్షులైన భారతీయ శాస్త్రవేత్తలు మనసా వాచా కర్మణా సుఖ సంతోషాలు వెల్లువెత్తిన దాంపత్యానికే సత్సంతానం సాధ్యం అవుతుంది.. అందుకే ఈ కామ శాస్త్రం.