ఇరవై ఏడేళ్లుగా హైదరాబాద్లో వుంటున్నాను. అంతకు ముందు పల్లె సొగసు, పట్నం పట్టు బాగా తెలిసిన స్వచ్ఛమైన తెలుగువాణ్ణి. గోలకపం (వందహాస్యగల్పికలు) రాంపా హాస్యకథలు (ఎమెస్కో ప్రచురణ) చదివే అలవాటులో, సుధారస, స్వీయసాధనలో (క్రేన్ వక్కపలుకులు గ్రంథి సుబ్బారావుగారి జీవన సారాంశం), వేలు మీద తేలు (హాస్య నాటిక) ఇప్పటివరకు ముద్రిత రచనలు.
ఆకాశవాణిలో హాస్యవార్తలు చదివాను. ఆంధప్రభ దినపత్రికలో భామభీమ అనే శీర్షిక నిర్వహించాను. ప్రసిద్ధుల పుస్తకాలకు ముఖచిత్రాలు లోపలి బొమ్మలు వేశాను. వేయికి పైగా కార్టూన్లు వేశాను. ఎన్నో కార్యక్రమాలకు మాటలపూజారిగా వ్యవహరించాను. సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలను వదలిపెట్టను. ఏ పని చేసినా ప్రజాశ్రేయస్సు, మానవీయ విలువలకే ప్రాధాన్యత ఇస్తాను.