నవ్వు తెప్పించే హాస్యకథల రూపంలోనో, ఆలోచింపజేసే నీతికథల రూపం లోనో, మనసును రంజింపజేసే శృంగారభరితమైన కథల రూపంలోనో కథ అనే ఈ పురాతన కళాప్రక్రియ నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే గత వందేళ్ళకి పైగా వచ్చిన ఆధునిక కథ సంగతి వేరు. మన జీవితాలను గతంతో అనుసంధానం చేస్తూనే, మారుతున్న సమాజానికి అనుగుణంగా మన ఆలోచనలను వ్యక్తం చేయడానికి కథ కొత్త మార్గాలను వెతుక్కుంటూనే ఉంది. అలా వెతుక్కుంటూ చేరిన విభిన్న, వినూత్న కథల సంకలనం ఈ కొత్తకథ 2018.