రత్నశ్రీ మొదట భరతనాట్యంలో సర్టిఫికెట్, డిప్లొమో కోర్సులను పూర్తి చేసుకొని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. మరియు ఎం.ఏ. పట్టాలను కూచిపూడి నాట్యంలో పొందడమే కాక ఎం.ఏ., లో గోల్డ్ మెడల్ ను కూడా సంపాదించారు. అప్పటినుండి అదే విశ్వవిద్యాలయంలో కూచిపూడి నృత్యశాఖలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. బోధనలో భాగంగా ప్రాయోగికానికి తోడుగా సిద్దాంత బోధన కూడా చేస్తున్నారు. తన అనుభవాన్ని పురస్కరించుకొని కూచిపూడినాట్యము అభ్యసించు సర్టిఫికెట్ మరియు డిప్లోమో విద్యార్ధులకు ఉపయోగపడే విధంగా ఈ గ్రంధమును వ్రాసింది. ఇంకా ముందుముందెన్నో గ్రంధాలు వ్రాయగలిగిన సామర్ధ్యమున్న రచయిత్రి రత్నశ్రీ. విరెన్నో ప్రవైటు సంస్థలకు సలహాదారుగా పని చేస్తున్నారు. ఈమె భర్త శ్రీ సుధాకర్ గారి సహకారం ఈ పుస్తక రచనకు మెరుగులు దిద్దింది. వీరు కూడా కూచిపూడి నాట్యశాఖలో అధ్యాపకులు కావటం దీనికి తోడ్పడింది.