కుప్పిలి పద్మకు ఆధునిక స్త్రీవాద రచయిత్రిగా సాహిత్య ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అర్బన్ మహిళల జీవన చిత్రాలను కథలుగా వెలువరించారు. మానవ సంబంధాలలోని సంఘర్షణను కొత్త కోణంలోనూ, జెట్ స్పీడుతో మారుతున్న ప్రపంచీకరణ పరిణామాల ప్రభావాన్నీ, ఆధునిక మహిళ ఎదుర్కొంటున్న సమస్యలను సునిశితంగానూ వీరి కథలు విశ్లేషిస్తాయి. అమాయకత్వాన్ని కోల్పోతున్న ప్రపంచాన్ని కళ్ళకు కట్టి దుఃఖ పెడతాయి. అంతిమంగా విలువల సంఘర్షణను ఆర్ద్రంగా చిత్రిస్తాయి.