బాలశౌరి రెడ్డిగారి హిందీనవల 'లకుమ' కూడా ఈ ఒరవడిలోదే. పి.రాజగోపాలనాయుడు గారు సాహిత్యాభిరుచి కలిగిన అతికొద్ది మంది ఆధునిక రాజకీయ వేత్తలలో పేర్కొనదగినవారు. వారు స్వయంగా నవలా రచన చేశారు. అనువాదాలు చేశారు. బాలశౌరి రెడ్డిగారి 'లకుమ'ను రాజగోపాలనాయుడు గారు హృదయంగమంగా తెలుగు చేశారు. 1977లో తొలిసారి ప్రచురితమైన ఈ నవలను మళ్లీ తెలుగు పాఠకుల ముందుకు తెస్తున్నందుకు ఎమెస్కో ఎంతో సంతోషిస్తున్నది.