PublisherD.Kameswari AuthorD.Kameswari ISBNPRAMADA0033 LanguageTelugu BindingPaperback Publication Date2014 No. of Pages240
Description
ఆ రోజుల్లో రచయిత్రులు కథలు తక్కువగాను, నవలలు ఎక్కువగానూ రాసేవారు. కామేశ్వరిగారు కథలే ఎక్కువ రాసారు. మూడుతరాల పాఠకులను తమ కథాకళితో అలరించారు. ఇంకా ఉత్సాహంగా అలరిస్తూనే ఉన్నారు. యాభై ఏళ్ళ క్రితం సగటు మనిషి సమస్యలు వేరు. సాధారణంగా రచయితలు మధ్యతరగతినే దృష్టిలో పెట్టుకుని సమాజాన్ని గమనిస్తూ ఉంటారు. ఆనాడు వరకట్నం, నిరుద్యోగం, కోడింటికం లాంటివి పెద్ద సమస్యలు. వాటి మీదే కథకుల కాలాలు సాగేవి. చాలా సందర్భాలలో ఆత్మహత్యను పరిష్కారంగా కథని ముగించేవారు. కొందరు మాత్రం సమస్యకు ఎదురునిలిపి, తెగువగా దారి సూచించేవారు. అలాంటి కొద్దిమంది రచయిత్రులలో కేమేశ్వరి మంచి పేరున్నవారు.