మహాత్ముడి చరిత్రను ఒక సైకాలజీ కోణంలో ఒక మేనేజిమెంటు కోణంలో రాయటానికి ఒక బలమైన కారణం ఉంది. గాంధీజీ బాల్యంలో బుద్ధిమంతుడేమీ కాదు. అల్లరి కొంచెం ఎక్కువే, అయితే ఇంట్లో కాదు, బయటే. ఇంట్లో విధించే కట్టుబాట్లను హేళన చేసేవాడు. కొన్ని సందర్భాలలో తిరగబడేవాడు.ఒకప్పుడు యవ్వనంలో చేసిన పొరపాట్లను దిద్దుకుని, ఒక అద్భుత మూర్తిగా తనని తాను రూపుదిద్దుకోగలిగాడు కాబట్టే ఆయన మహాత్ముడయ్యాడు. ఆ గాంధీజీ ఆత్మకథలో ఎన్నో అనుభవాలు, తీయటి, చేదు జ్ఞాపకాలు ఉన్నాయి.