సిద్దప్పే సిద్దేంద్ర యోగి. అతడే కూచిపూడి నాట్యవిద్యకు ఆద్యుడు. నారాయణ తీర్దులవారి శిష్యుడు. కూచిపూడి నాట్యకళను నేడు అనేక దేశాలవారు అభ్యసిస్తున్నారు. మన రాష్ట్రంలోని 12 ప్రభుత్వ, సంగీత కళాశాలల్లో కూచిపూడి నాట్య శిక్షణ ఇస్తున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం కూడా ఆన్ లైన్ పద్దతిలో నాట్య శిక్షణకు ప్రయత్నాలు చేస్తుంది. తెలుగు సంస్కృతి, కళల పరిరక్షణే మనందరి ధ్యేయం. అందుకు దీక్ష పునడానికి ఈ పుస్తకం దోహదం చేస్తుంది. ఇంతటి గోప్పకళకు కాజ వెంకట సుబ్రహ్మణ్యం గారు శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ ద్వారా గొప్ప సేవలు అందిస్తున్నారు.ఇందులోని 27 శీర్షికలు కూచిపూడి, ఒడిస్సీ, కధకళి, కధక్, మణిపురి నృత్యం పుట్టుక, కూచిపూడి నాట్య చరిత్ర, భామా కలాపం, తిల్లానా అభినయం, ఆంధ్రుల నాట్యకళ, ఛాయా చిత్రాలు వంటివెన్నో ఉన్నాయి. అవన్నీ మనల్ని అలరించి నాట్యకళ ప్రేమాభిమానాలను పెంపొందిస్తాయి. ఈ కళను పోషించాలనే అభిలాష మనలో రేకెత్తించే పుస్తకమిది.